logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సెక్యూరిటీ గార్డ్ పై దాడి ఘటనలో ఇద్దరిపై కేసు. గురువారం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వసుంధర షాపింగ్ మాల్ వద్ద ఘటన.

పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 13 :-



నిందితుని స్కూటీ స్వాధీనం.

రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు.

ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్.

నిందితులు
1) షేక్ సమీర్, క్రాంతి నగర్.
2) సాబిల్, క్రాంతి నగర్.

గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక సినిమారోడ్డు లో గల వసుంధర షాపింగ్ మాల్ వద్ద వారి సెక్యూరిటీ గార్డ్ పై వాహనం పార్కింగ్ విషయంలో గొడవ జరగగా సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన ఆదిలాబాద్ పట్టణ క్రాంతి నగర్ కి చెందిన షేక్ సమీర్ మరియు సాబిల్ లపై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. ఫిర్యాదుదారుడు మరియు బాధితుడు రాథోడ్ రవి వసుంధర షాపింగ్ మాల్ నందు సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. బాధితునిపై విచక్షణ లేకుండా డాడీకి పాల్పడిన ఇద్దరి పై ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. రౌడీయిజం చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ పట్టణంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులు ఎవరైనా నిర్వహణ జిల్లా పోలీసులను సంప్రదించవచ్చని పోలీసులు అండగా ఉంటూ తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

0
0 views

Comment