మర్రి నరేష్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంపీ అర్వింద్ ధర్మపురి లేఖ
నిజామాబాద్, మార్చి 13, 2026:
రాబోయే గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్‌ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి లేఖ రాశారు.
నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాల్లో గోదావరి తీరం వెంట ఉన్న ఘాట్‌లకు కోట్లాది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా కందకుర్తి, పోచంపాడ్, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్‌ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉండనున్నందున ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధాన డిమాండ్లు:
మౌలిక సదుపాయాలు: ఘాట్‌ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ.
పౌర సేవలు: తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం మరియు నిరంతర విద్యుత్ సరఫరా.
భద్రత: పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, అగ్నిమాపక సేవలు.
ఆరోగ్యం: వైద్య శిబిరాలు మరియు అంబులెన్స్ సదుపాయాలు.
రవాణా: ఆర్టీసీ (RTC) ప్రత్యేక బస్సులు మరియు పార్కింగ్ స్థలాల కేటాయింపు.
పుష్కరాల సమయంలో కోట్లాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి, పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.