కన్నంపేటలో కూటమి నాయకులు సీసీ రోడ్డు శంకుస్థాపన
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కన్నంపేట గ్రామంలో దంట్ల కన్నబాబు, గొల్లవిల్లి బాబురావు ఇంటి నుంచి దంట్ల పెద్దబ్బాయి, దంట్ల సత్యనారాయణ ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం శుక్రవారం జరిగింది.ఈ సందర్భంగా కూటమి నాయకులైన మాజీ సర్పంచ్ దంట్ల అరుణా రాజేష్, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ రావికంతో మండల బిజెపి ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ గేదెల శ్రీరామ్ మూర్తి, మాజీ నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ దంట్ల అచ్యుతరావు, కన్నంపేట టీడీపీ గ్రామ అధ్యక్షుడు సూర్యానందరావు, మండల టీడీపీ కార్యదర్శి విసారపు తాతారావు, గ్రామ నాయకులు సేనాపతి బాబురావు, వజ్రపు శేషు, రమణ, రాము తదితరులు పాల్గొన్నారు.ఈ రోడ్డు నిర్మాణం గ్రామవాసుల ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, అభివృద్ధికి ముఖ్యమైనదని నాయకులు పేర్కొన్నారు.