భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్దిపాలెంలో కవయత్రి మొల్లమాంబ జయంతి
. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం పెద్దిపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కిల్లాడ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కవయత్రి మొల్లమాంబ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొల్లమాంబ చిత్రపటానికి ముఖ్య అతిథులు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భాజపా విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీను మాట్లాడుతూ, సరళ తెలుగులో రామాయణాన్ని ఐదు రోజుల్లో రచించిన కవయత్రి మొల్లమాంబను కుమ్మరి మొల్లమాంబగా కూడా పిలుస్తారని, మట్టి మన సంస్కృతి, మట్టి మన జీవనం అని, ఆ మట్టిని కళగా మార్చి సమాజానికి పాత్రలు అందించిన కుమ్మరి సాంప్రదాయంలో పూర్వీకుల గౌరవం, సంస్కృతి, జీవన విధానం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జి కాకరపల్లి సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడారి శ్రీధర్, జిల్లా కార్యదర్శి బొలెం శివ, భాజపా రాష్ట్ర సీనియర్ నాయకులు గాదె శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ చిటికెల బాబు, మాజీ సర్పంచ్ బోలెం సన్నిబాబు, ఓబీసీ సీనియర్ నాయకులు కరి రామకృష్ణ, అచ్చం నాయుడు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.