కొవ్వూరు పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి ఉచితంగా అందించిన బంటు రాజు
కొవ్వూరు గ్రామ పంచాయతీ ఉన్నత పాఠశాలలో మండల ఐటీడీపీ అధ్యక్షుడు బంటు రాజు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని ఉచితంగా పంచారు.16వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు ప్లాన్క్, పెన్ను, పెన్సిల్, రబ్బరు అందజేశారు. గత సంవత్సరాలుగా గ్రామ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి సహాయం అందిస్తున్నానని ఆయన తెలిపారు.విద్యార్థుల ప్రతిభావికాసం తనకు సంతోషమని చెప్పారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మజా కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు