ప్రజాపాలన ప్రగతిప్రణాళికలో భాగంగా టెక్రియల్ చెరువు, మరియు క్రుప్రియల్ హైవే ఇరుపక్కలజరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
కామారెడ్డి ప్రతినిధి( పాముల సంతోష్ కుమార్
తేది:13.03.2026
కామారెడ్డి జిల్లా శుక్రవారం
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కుప్రియాల్ గ్రామపంచాయతీ , మరియు జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ చెరువు వద్ద నిర్వహిస్తున్న శానిటేషన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.
అనంతరం సదాశివ నగర్ – క్రుప్రియల్ హైవే ఇరుపక్కల జరుగుతున్న శానిటేషన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
టెక్రియాల్ చెరువులో గణేష్, దుర్గాదేవి నిమజ్జనం జరిగిన ప్రదేశాలలో చెరువు పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, శానిటేషన్ పనులు పూర్తి చేసి, ఈరోజు సాయంత్రం లోపు ఆ ప్రాంతాన్ని సమతలంగా (లెవెల్) చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల ఆరోగ్యం , పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలని ప్రజాప్రతినిధులు పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో dpo మురళీ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, dlpo శ్రీనివాస్, ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్ కొత్తపల్లి లలిత,పంచాయతీ, మున్సిపల్ , శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.