logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇంటర్ విధానం రద్దు చేస్తం *వచ్చే ఏడాది నుంచి నర్సరీ టు 12వ తరగతి: సీఎం రేవంత్ రెడ్డి,

ఇంటర్ విధానం రద్దు చేస్తం

*వచ్చే ఏడాది నుంచి నర్సరీ టు 12వ తరగతి: సీఎం రేవంత్ రెడ్డి,

*ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఉచితంగా లేదంటే 50% రాయితీతో రవాణా సౌకర్యం,

*సామాన్యుడు భరించలేని స్థాయిలో వైద్య ఖర్చులు,

*ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో నెలపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలి,

*20 ఏండ్ల ఆరోగ్యశ్రీ డేటాతో 65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు,

*సంక్షేమ పథకాలకంటే పేదలు తమ కాళ్లపై నిలబడేలా చేయడమే మా లక్ష్యం,

*కోకాపేటలో మెడికవర్ ఆస్పత్రి ప్రారంభం,

*వైద్యులు రోబోల్లా మారొద్దని.. మానవత్వం చూపాలని హితవు,


విద్యారంగంలో వచ్చే ఏడాది నుంచి సరికొత్త మార్పులు తేబోతున్నామని. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్మీడియెట్ విధానాన్ని రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు తెస్తామని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే నూతన విధానాన్ని తీసు కురాబోతున్నామని చెప్పారు. డ్రాప్ అవుట్స్ ను తగ్గించడానికి ప్రభుత్వ స్కూల్ విద్యార్థు లకు ఉచితంగా లేదా 50 శాతం రాయితీతో రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. కూలి పనులకు వెళ్లే పేదల పిల్లల కోసం ఉదయం పూట పాలు, నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్ తో పాటు మధ్యాహ్నం ఆరోగ్యకరమైన భోజనం పెడతా మని చెప్పారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న డాక్టర్లు విధిగా ఏడాదిలో నెల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా సేవలు అందించాలని"సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం కోకాపేటలో మెడికవర్ హాస్పిటల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఈ విధానంవల్ల కార్పొరేట్ వైద్యులకు ఉన్న అపార అనుభవం పేదలకు అందుతుందని, ప్రభుత్వ వైద్యవ్యవస్థ పై పై ప్రజల్లో ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటీ ముప్పై లక్షల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుంద న్నారు. గత ఇరవై ఏండ్ల ఆరోగ్యశ్రీ రికార్డులను క్రోడీకరించి, 65 లక్షల మందికి ప్రత్యేకంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయబోతున్నట్టు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతంలో క్లస్టర్ విధానం ద్వారా తొలుత ఈ నూతన విద్యావిధానం, రవాణా వ్యవస్థను అమలు చేయబోతున్నామని వివరించారు.నాణ్యమైన విద్య, వైద్యం అందించినప్పుడే మన యువత ప్రపంచంతో పోటీ పడగలుగుతుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు పంచడం కంటే, వారిని తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రభుత్వ అసలైన లక్ష్యమని సీఎం అన్నారు.

*చదువుల్లో నాణ్యత ఏదీ..?*

రాష్ట్రంలో 26 వేల పాఠశాలలు, 21 లక్షల మంది విద్యార్థులు న్నారని, ప్రస్తుతం అందుతున్న యాంత్రి కమైన విద్య తల్లిదండ్రులకు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వడం లేదని సీఎం చెప్పారు. ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి ఇచ్చిన నివేదిక ప్రకారం మన విద్యా ప్రమాణాలు అత్యంత దయనీ యంగా ఉన్నాయని, మూడో తరగతి చదువుతున్న పిల్లలకు రెండో తరగతి పుస్తకం ఇస్తే కేవలం 5 నుంచి 6 శాతం మంది మాత్రమే చదవగలుగు తున్నారన్నా రు. ఐదేండ్లు నిండితేనే ఒకటో తరగతిలో చేర్చుకునే పాత ప్రభుత్వ నిబంధనల వల్ల పేద విద్యార్థులు కార్పొ రేట్ పిల్లలతో పోటీ పడలేక వెనుకబడిపోతున్నారని చెప్పారు. మరోవైపు ఏటా 1.50 లక్షల మంది ఇంజనీ రింగ్ పట్టాలు పుచ్చు కుంటున్నా, అందులో 20శాతం మందికి కూడా సర్టిఫికెట్ కు తగ్గ నైపుణ్యాలు ఉండటం లేదన్నారు. ఈ గ్యాప్ ను పూడ్చడానికే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ లో 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ ర్సిటీ'ని ఏర్పాటు చేశామన్నారు. ఆనంద్ మహీంద్రా. చైర్మన్ గా ఉన్న ఈ వర్సిటీలో అపోలో, డాక్టర్ రెడ్డీస్, బ్యాంకింగ్ రంగాల నిపుణులు నేరుగా కరిక్యులమ్ డిజైన్ చేస్తున్నారని వివరించారు. శిక్షణ పొందిన విద్యార్థుల్లో 90 శాతం మందికి ఆయా కార్పొరేట్ సంస్థలే ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థను రూపొందించిన ట్టు చెప్పారు. వర్సిటీ రోజువారీ కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, కేవలం ఫెస్ లిటేటర్ గా మాత్రమే ఉంటుందని తెలిపారు.

*ఐటీఐలకు మహర్దశ.. వైద్యానికి పెద్దపీట..

*1956లో ఏర్పాటు చేసిన ఐటీఐలలో ఇప్పటికీ అంబా సిడర్ కార్ల రిపేర్ లాంటి కాలం చెల్లిన సాంకేతికతనే నేర్పుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అందుకే పాత సిలబస్ ను రద్దు చేసి టాటా సంస్థ భాగస్వామ్యంతో ఐటీఐలను ఏటీసీలుగా (ఆడ్వా న్స్ టెక్నాలజీ సెంటర్స్) అప్ గ్రేడ్ చేశామన్నారు. రూ.2,400 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టగా, టాటా సంస్థ సీఎస్ఆర్ కింద 2,100 కోట్లు పెట్టుబడి పెడుతుంద ని, ప్రభుత్వ వాటా కేవలం 14 శాతం మాత్రమేనని తెలిపారు. ఇప్పటికే 65 సంస్థలను ప్రారంభించామని, భవిష్యత్ లో పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఈ ఆధునిక వ్యవస్థ కిందికి తీసుకు వస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడుతున్నాయని, అందుకే బ్లూ కాలర్ జాబ్స్ కు యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

*రోబోల్లా మారొద్దు.. మానవత్వం చూపండి..

*దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం కేవలం హైద రాబాద్ నుంచే జరగడం మనకు గర్వకారణ మని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో మూడు కీలక వ్యాక్సిన్లు మన జీనోమ్ వ్యాలీ నుంచే రావడం మన సత్తాకు నిదర్శన మన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పీవీ నరసింహా రావు తీసుకువచ్చిన సరళీకరణ విధానాలే నేటి హైద రాబాద్ అభి వృద్ధికి బలమైన పునాదులు వేశాయని ప్రశంసించారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని పూర్తి చేసి ఈ నగరాన్ని అద్భుతమైన ఐటీ హబ్ గా మార్చారన్నారు. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న మెడికవర్ హాస్పిటల్స్ కోకాపేటలో ఏర్పాటు కావడం నగర వైద్య సదు పాయాలను మరింత బలోపేతం చేస్తుందని సీఎం ఆకాంక్షించారు. వైద్య వృత్తిలో ఉన్నవారు యాంత్రికంగా రోబోల్లా కాకుండా, రోగులకు మానవత్వంతో సేవలు అందిం చాలన్నారు. ఇంట్లో మహిళల ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుందని, తద్వారా ప్రభుత్వం ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరమే రాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

138
3988 views

Comment