logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు వైఎస్ ఆశయాల సాధనకే పార్టీ కట్టుబాటు: మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం జిల్లా రాజాం:

రాజాం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నియోజకవర్గ ఇన్‌చార్జ్ తలే రాజేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పార్టీ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు పోరాటం కొనసాగిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలవలస శ్రీనివాసరావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

14
541 views

Comment