ఆంధ్రప్రదేశ్ లో మూడవ ప్రత్యమ్నాయ శక్తిగా "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ " పార్టీ..!?
ఆంధ్రప్రదేశ్ లో మూడవ
విజయవాడ (12.03.2026)
ప్రత్యమ్నాయ శక్తిగా "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ " పార్టి బలోపేతం అవుతుందని , 2029 ఎన్నికల్లో చట్ట సభలకు కొత్తవారిని పంపంచటమే లక్ష్యంగా ఏపి లో గల 175 అసెంబ్లీ స్థానాలకు కో - ఆర్థినేటర్ల ను , 25 పార్లమెంట్ నియోజకవర్గాకు కన్వీనర్లను , 28 కొత్త జిల్లాలకు అధ్యక్ష , కార్యదర్శులను నియమించటమే లక్ష్యాగా అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని ఆ పార్టి ఏపి రాష్ట్ర శాఖ కో - ఆర్డినేటర్ పంగులూరి బుచ్చిబాబు , ఆర్గనైజింగ్ సెక్రిటరి డా. కొమ్మోజు రమేష్ లు సంయుక్తంగా తెలిపారు .
ఈ మేరకు సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా లెక్కల ధరణి కుమార్ , కదిరి , పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు కో - ఆర్డినేటర్ల గా కొట్టం హరిప్రసాద్ , మంకముతక మంజునాథ లను పంగులూరి బుచ్చిబాబు , కొమ్మోజు రమేష్ ల సిఫార్సు మేరకు మేడా శ్రీనివాస్ చేతుల మీదుగా అధికారిక పత్రాలను జారి చేసారు .
కదిరి బస్ స్టాండ్ సెంటర్ లో గల హోటల్ అత్తార్ రెసిడెన్సీ లో పార్టి సెక్యులర్స్ తో జరిగిన అంతర్గత సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కులు రోజు రోజుకు నిర్వీర్యం అయిపోతున్నాయని, మానవతా విలువలు అడుగంటి పోతున్నాయని, రాష్ట్ర సంపద ఇతర రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలకు , అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల ఆర్థిక స్వలాబాల కోసం దోచుకు పోతున్నారని , అపార ఖనిజ సంపద గల ఆంధ్ర రాష్ట్రం నానాటికి పేదరికంతో మగ్గిపోతుందని , మన రాష్ట్ర సంపదను మన బిడ్డల అభ్యున్నతికి, భవిష్యత్ కు పయోగించే విధంగా , పేదరికం లేని సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల సొంతం చేద్దామని, అందుకు ప్రజా చైతన్యం తో బాటుగా చైతన్యం తో కూడిన ఉద్యమం తప్పదనిb మేడా శ్రీనివాస్ తెలిపారు.