logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడారి నరేష్ నేటి వార్త : డా. వర్ధినేని శ్రీనివాస్ రావు గారి జన్మదిన సందర్భంగా పుస్తకాల విరాళం

జగిత్యాల జిల్లా: కథలపూర్ మండలంలోని బొమ్మేన గ్రామానికి చెందిన డా. వర్ధినేని శ్రీనివాస్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, “కేక్ వద్దు – పుస్తకం ముద్దు” అనే నినాదంతో డా. చిందం సుధాకర్ అన్న గారు మన బడి – మన గ్రంథాలయానికి విలువైన నాలుగు ప్రేరణాత్మక పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన పుస్తకాలు
1.Rich Dad Poor Dad
2.The Psychology of Money
3.Atomic Habits
4.Deep Work అనే పుస్తకాలను విద్యార్థుల కోసం గ్రంథాలయానికి అందించడం జరిగింది.
గ్రామంలో విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించే ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.
ఈ సందర్భంగా డా. వర్ధినేని శ్రీనివాస్ రావు గారు ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. 💐🎂

20
973 views

Comment