డా. లీలా సౌమ్యకు డాక్టరేట్ పట్టా!!
ఇంగ్లీష్ సాహిత్య పరిశోధనలో డా. లీలా సౌమ్యకు డాక్టరేట్ పట్టా!!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలలో ఇంగ్లీష్ విభాగంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న లీలా సౌమ్య ఉత్తరప్రదేశ్‌లోని గ్లోకల్ యూనివర్సిటీ నుండి పీహెచ్.డి పట్టా ను సాధించారు.
“1857 నుండి 1947 వరకు భారతీయ ఆంగ్ల సాహిత్యంలో నాన్-ఫిక్షనల్ గద్య రచనలు” అనే అంశంపై పరిశోధన చేసి ఆమె డాక్టరేట్ పట్టాను పొందారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో భారతీయ రచయితలు ఆంగ్ల భాషలో రచించిన వాస్తవాధారిత గద్య రచనలను విశ్లేషిస్తూ ఈ పరిశోధనను పూర్తి చేశారు.
లీలా సౌమ్య పీహెచ్.డి పట్టాను సాధించినందుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పోలారపు పద్మ, అధ్యాపకులు మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.