logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నీటి నిర్వహణలో కృత్రిమ మేధస్సు పాత్ర విస్తృతమైనది: ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బారావు.

పాణ్యం (AIMA MEDIA): నీటి నిర్వహణలో కృత్రిమ మేదస్సు (ఏఐ) పాత్ర విస్తృతమైనదని మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బారావు పేర్కొన్నారు. ఆర్ జి ఎం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సివిల్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాంకేతిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నీటి పంపిణీని మెరుగుపరచడానికి, లీకేజీలు, కాలుష్యాన్ని గుర్తించడం, వరదలు, కరువుల వంటి విపత్తులను అంచనా వేయడానికి నిర్వహించడానికి ఏఐ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వరంగల్ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ హరీఫ్ అలీ మొగల్ బేగ్ మాట్లాడుతూ నేల స్థిరీకరణ అనేది మట్టి యొక్క భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలను మెరుగుపరిచి దాని నిర్మాణ బలం మన్నిక లోడ్ బేరింగ్ సామర్ధ్యాన్ని పెంచే ప్రక్రియ అన్నారు. సిమెంటు, సున్నం, పాలిమర్ ఆధారిత స్టెబిలైజర్ ను ఉపయోగించి బలహీనమైన నేలలను, రోడ్లు, హెలిపాడ్, ఆనకట్టల నిర్మాణానికి అనువుగా మారుస్తారు అన్నారు. ఈ పద్ధతి నేలకోతలు తగ్గించి పగుళ్లను అరికట్టడంలో సహాయపడుతుందన్నారు. గూగుల్ ద్వారా విద్యార్థులతో టర్కీ దేశం అంకార యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ వి స్సైల్ హెచ్ ఆకాన్స్ష్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాతావరణం గుర్తించడం, భూకంపాలు, వరదలు గుర్తించడంలో సహకరిస్తుందన్నారు. ఇది కంప్యూటర్ సైన్స్ పరిశోధనా రంగం అన్నారు. సాఫ్ట్వేర్లను అభివృద్ధి పరుస్తుంది అన్నారు. అనంతరం సదస్సు సావనీర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జయ చంద్ర ప్రసాద్, డాక్టర్ అశోక్ కుమార్, హెచ్ ఓ డి డాక్టర్ శ్రీనివాసులు, కన్వీనర్ సునందనారెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

0
0 views

Comment