logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బీసీల సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు కేటాయించాలి: మంచిర్యాలలో నిరసన


​మంచిర్యాల, మార్చి 12, 2026
​రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమం కోసం రూ. 50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల సీసీసీ కార్నర్ వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
​ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత బడ్జెట్లలో కేవలం రూ. 9 వేలు, రూ. 11 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను వంచించిందని విమర్శించారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవని, తక్షణమే బడ్జెట్ పెంచకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్జెల్లి వెంకటయ్య, వేముల అశోక్, చంద్రమౌళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
​రిపోర్టర్: శ్రీనివాస్, మంచిర్యాల

43
372 views

Comment