logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జాతీయ స్థాయిలో శాంతిరాం విద్యార్థుల ప్రతిభ.

నంద్యాల (AIMA MEDIA): రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (RGMCET) ఆధ్వర్యంలో నిర్వహించిన DEFEND-X – RIPPLE-2K26 జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియంలో శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థులు ప్రతిభ కనబరచి కళాశాలకు గౌరవం తీసుకొచ్చారు.ఈ సింపోజియంలో దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొని తమ సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఎస్క్యుఎల్ హంటర్ పోటీలో శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అశ్వత్ కంఠ మెరిట్ సాధించి ప్రత్యేక ప్రతిభ చూపించారు. అదే విధంగా నిర్వహించిన కాగిల్ పోటీలో వై. అశోక్, కాసా క్రాంతి కిరణ్, కే. రోహిత్ కుమార్ గౌడ్ అద్భుత ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. ఇక అదే సింపోజియంలో నిర్వహించిన ప్రాంప్ట్ ఇంజినీరింగ్ పోటీలో శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రాహుల్ బరికీ విశేష ప్రతిభ కనబరచి ద్వితీయ స్థానం సాధించి కళాశాలకు మరొక గౌరవాన్ని తీసుకొచ్చారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, విభాగాధిపతులు మరియు అధ్యాపకులు విజేత విద్యార్థులను అభినందించారు. ముఖ్యంగా డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం మరియు డా. జె. డేవిడ్ సుకీర్తి కుమార్ విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలు కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచాయని తెలిపారు.

5
835 views

Comment