logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రైలు కిందపడి ఒకరు మృతి.

కోటబొమ్మాళి: హరిశ్చంద్రపురం రైలు నిలయం సమీపంలో బుధవారం ఇదే మండలం నిమ్మాడ జంక్షన్‌కు చెందిన తంగుడు వెంకటరమణ (60) రైలు కిందపడి మృతి చెందాడు. పలాస రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరమణ నిమ్మాడ జంక్షన్‌లో పాన్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాలతో భార్య భారతి, కుమారులు మహేష్‌, సందీప్‌ కొన్నేళ్ల కిందట వెంకటరమణను వదిలేసి జలుమూరు మండలం చల్లపేటలో నివాసముంటున్నారు. అప్పటి నుంచి ఒక్కడే పాన్‌షాపును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటరమణ మృతికి గల కారణాలు తమకు తెలియదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ మేరకు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0
0 views

Comment