ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడి మృతి
నరసన్నపేట: జమ్ము గ్రామం వద్ద ఎన్‌హెచ్-326 రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన కొత్తరెడ్డి కృష్టారావు (73) మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణారావు తన ఇంటి నుంచి సైకిల్‌పై మామిడి తోటకు వెళ్తుండగా.. తోట సమీపంలో జాతీయ రహదారిపై నరసన్నపేట నుంచి పాతపట్నం వైపు వెళ్తు ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణారావు తలకు బలమైన గాయాలు కాగా చికిత్స నిమిత్తం నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందారు. కృష్ణారావు భార్య పాపమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గణేష్ తెలిపారు. కాగా వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.