logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లాలోని సదాశివనగర్ మండలం లోని వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నానో యూరియా వాడకంపై ఆగాహన

కామారెడ్డి ప్రతినిధి (పాములసంతోష్ కుమార్)
తేది:11.03.2026

కామారెడ్డి జిల్లా బుధవారం
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని సదాశివ నగర్ మండలం లోని వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

1
329 views

Comment