పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ – ఫోరం ఫర్ ఆర్టీఐ & హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవా కార్యక్రమం
నాయుడుపేట: తిరుపతి జిల్లా
నాయుడుపేట పట్టణంలోని లోతువానిగుంట ఎస్సీ హాస్టల్ (1+2)లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఫోరం ఫర్ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్మోజు రమేష్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి పంగులూరి బుచ్చిబాబు ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలు షాజిద్ సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హాస్టల్‌లో చదువుతున్న 40 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన పెన్‌లు, పెన్సిల్స్, ప్యాడ్స్ వంటి పరీక్ష సామాగ్రిని సంస్థ సభ్యుల చేతుల మీదుగా చిరు కానుకగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలు షాజిద్, విద్యార్థులను ఉత్సాహపరుస్తూ ప్రతి ఒక్కరూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలను బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులవాలని సూచించారు. మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దుకుని ఉన్నత విద్యలు అభ్యసించి మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు టి. రవికుమార్, జి. శ్రీనివాసులు, డి. జయచంద్ర, చింతకాయల మురళి, సి.హెచ్. సుధాకర్, ఎం. ముత్యాలయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు