logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారికి తిరుమల దేవుని సత్కారం.

ఆళ్లగడ్డ :: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అహోబిల క్షేత్రానికి,తిరుమల దేవాలయానికి అవినాభావ సంబంధం ఉంది.108 దివ్యదేశాలలో ఆంధ్ర దేశంలో ఉన్న రెండే రెండు దివ్యదేశాలు.తిరుమల శ్రీనివాసుడు అహోబిల లక్ష్మీ నృసింహుని ఆరాధకుడు.అహోబిలేశ్వరులచే త్రిదండ సన్యాసములు పొందిన ఆదివన్ శఠగోప యతి తిరుమలకు సోపాన మార్గమును నిర్మించి,స్వామి వారికి నందనవనమును ఏర్పాటు చేశారు.తిరుమల ఆలయ కవి అన్నమయ్య అహోబిల మఠం స్థాపనాచార్యులైన ఆదివన్ శఠగోప యతికి శిష్యులు.ఇలా ఎన్నో విశేషాలు గల అహోబిల-తిరుమల క్షేత్రాల సంబందం నేడు సాకారమైనది.
శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పరంపర ధర్మకర్త,శ్రీ ఆదివన్ శఠగోప యతికి 46వ తరమైన అహోబిల మఠం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికులు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అహోబిల మఠం శిష్యులతో కూడి మంగళాశాసనం చేశారు.ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం,టీటీడీ కార్యనిర్వహణాధికారి సమక్షంలో అర్చకులు మొదట ఇస్తకఫాల్ స్వాగతం పలికారు.ఈ సందర్భాంగా స్వామివారి శఠారి ని పంచ ముద్రాత్మకంగా పీఠాధిపతి వారికి సమర్పించారు.అనంతరం పీఠాధిపతి వారు మహాద్వారం గూండా ఆలయంలోకి ప్రవేశించి,ధ్వజస్తంభం వద్ఓ నమస్కరించారు.అనంతరం సన్నిధిలోకి ప్రవేశించారు.కులశేఖర పడి వద్ద శ్రీ పీఠాధిపతి వారికి శేష వస్త్రం బహుకరించారు.అనంతరం శ్రీ అహోబిల మతం శిష్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమ ఆచార్యుల సమక్షంలో దర్శించుకున్నారు.అనంతరం శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారిని టీటీడీ అధికారులు ఛత్ర చామర గజ తురగాది సమస్త రాజోపచారములతో అహోబిల మఠానికి తీసుకుని వచ్చారు.అహోబిల మఠం వద్ద టీటీడీ ఈ.ఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర, డిప్యూటీ ఈ. ఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి లు శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి ఆశీస్సులు అందుకున్నారు.ఈ నెల 15.03.2026 న తిరుమల లో జరిగే అన్నమాచార్య వర్ధంతి మహోత్సవం లో శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారు ముఖ్యాధ్యక్షులుగా పాల్గొనున్నారు.

17
1045 views

Comment