22వ ర్యాంకు సాధించిన గీతిక అరోరాకు జాతీయ ఓబీసీ అధ్యక్షులు ప్రత్యేక అభినందనలు
ఢిల్లీలోని ఇంద్రప్రస్థ మహిళా కాలేజీ విద్యార్థిని, హర్యాన గీతిక అరోరా సివిల్ సర్వీసెస్ పరీక్షలో జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించారు. ఈ అద్భుత విజయాన్ని జాతీయ ఓబీసీ (జ్యోతిరావు పూలే) సంఘటన అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు అభినందనలు తెలిపారు.పోతల ప్రసాద్ నాయుడు గీతిక అరోరాను కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు, ఆమె సాధనను ప్రశంసించారు. "గీతిక అరోరా సాధించిన ఈ ఘనత విద్యార్థి సమాజానికి గర్వకారణం. ఆమె కష్టపడి చదువుకోవడం, లక్ష్యసాధనలో చూపిన తపన యువతకు ఆదర్శం. ఇలాంటి పోరాట భావనతో మా సమాజ యువత మరింత ఉత్తేజంగా పోటీపరీక్షలకు సిద్ధమవ్వాలి" అని అధ్యక్షుడు మాట్లాడారు.అనంతరం గీతిక అరోరా ఓబీసీ జాతీయ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపింది. "సంఘటన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం లేకుండా ఈ విజయం సాధ్యం కాదు. నా ఘనతను గుర్తించినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు" అని ఆమె చెప్పుకుంది.కార్యక్రమంలో పోతల ప్రసాద్ నాయుడు కేకు కట్ చేసి గీతికకు తినిపించడంతో పాటు, ప్రత్యేక జ్ఞాపిక సమర్పించి అభినందించారు. ఈ ఘనత విద్యార్థులకు ప్రేరణగా మారనుందని సంఘటన నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.గీతిక అరోరా విజయం హర్యానా, ఓబీసీ సమాజాలకు సంతోషాన్ని పంచింది. ఆమె భవిష్యత్ కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని అందరూ ఆశిస్తున్నారు. ఆమె విజయాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రసాద్ నాయుడు పిలుపునిచ్చారు