logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పుస్తకం పట్టు.భవిష్యత్తును దిద్దు.విద్యార్థులకు జనసేన‌ నాయకులు. ఇరిగెల కీలక సూచన

AIMA న్యూస్‌ బ్యూరో. రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు, అధికార దాహం మాత్రమే అని మెజారిటీ ప్రజల అభిప్రాయం. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ యువతను, విద్యార్థులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే నాయకులెందరో మనం చూస్తుంటాం. కానీ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి ప్రదర్శించిన సంస్కారం, నేటి రాజకీయాలకు ఒక కొత్త దిశానిర్దేశం చేసింది. నిన్నటి రోజున (మంగళవారం) ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయానికి కొంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు వచ్చారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, జనసేన పార్టీ విధానాల పట్ల ఆకర్షితులైన ఆ యువకులు, పార్టీ కండువా కప్పుకుని పూర్తిస్థాయిలో జనసైనికులుగా మారాలని వారు విచ్చేయడం జరిగింది. వారిలో ఉన్న ఉత్సాహం, అభిమానం నిజంగా అభినందనీయం.ఏ ఇతర పార్టీ నాయకుడైనా ఆ సమయానికి ఏం చేసేవాడు వెంటనే కండువాలు కప్పేసి, ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో యువత అంతా మా వైపే అని హంగామా చేసేవారు. కానీ,ఇరిగెల రాంపుల్లారెడ్డి అలా చేయలేదు. ఆయన ఆ విద్యార్థులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, ఒక తండ్రిలా, ఒక అన్నలా హితవు పలికారు. మీ ఉత్సాహం, అభిమానం నాకు అర్థమవుతోంది. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇది మీ భవిష్యత్తును తీర్చిదిద్దే కీలకమైన సమయం. ఇప్పుడు మీకు రాజకీయం కంటే చదువు ముఖ్యం. ముందు బాగా చదువుకుని, మంచి స్థాయికి చేరుకోండి. ఆ తర్వాత సమాజానికి సేవ చేయడానికి చాలా సమయం ఉంటుంది. అనడంతో ఆయన మాటలు ఆ విద్యార్థుల కళ్లు తెరిపించాయి. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం జెండాలు మోయడం, నినాదాలు చేయడం కాదు, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం అని ఆయన నిరూపించారు. ఓట్ల కోసం చదువుకునే పిల్లల జీవితాలతో ఆడుకోకూడదనే నిబద్ధత, ఆయనను విలువల వారధి గా నిలబెట్టింది.పదవి కోసం ఏమైనా చేసే నేటి రోజుల్లో, నైతిక విలువలను పాటిస్తూ రాజకీయం చేయవచ్చని చూపించారు.
యువతకు, వారి భవిష్యత్తుకు మధ్య వారధి. ఉత్సాహంతో దారి తప్పే అవకాశం ఉన్న యువతకు సరైన మార్గం చూపించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాట వేశారు.పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్పే విలువల రాజకీయం అనే మాటను ఆచరణలో చూపి, జనసేన అంటే ఏమిటో నిరూపించారు.ఆళ్లగడ్డ ప్రజలు గర్వించదగ్గ నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి.ఆయన చేసిన ఈ పని, కేవలం జనసేన పార్టీకే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థకే ఒక గొప్ప స్ఫూర్తి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే నిజమైన దేశభక్తి అని చాటిచెప్పిన ఆయనకు, విలువల వారధి. అనే బిరుదు పరిపూర్ణంగా సరిపోతుంది.

109
10488 views

Comment