అరకు: కరెంట్ సౌకర్యం కల్పించాలని, బిల్లులు చెల్లించాలని వినతి
పీఎం జన్మన్ గృహాలకు బిల్లులు సకాలంలో చెల్లించాలని పివిటిజి సంఘం నాయకులు స్వాభి రామ చందర్ కోరారు. ఈ మేరకు మంగళవారం పాడేరు ఐటీడీఏ ఏపీఓ(PVTG) వేంకటేశ్వరరావు ను కలిసి వినతి పత్రం అందించారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న గృహాలకు కరెంటు స్తంభాలు, కరెంట్ మీటర్స్ ఏర్పాటు చెయ్యాలని వినతి లో కోరారు. ఈ కార్యక్రమంలో పీవీటీజీ సంఘ నాయకులు బలరాం, గిరి, లక్ష్మణ్ పాల్గొన్నారు.