logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కులాంతర ప్రేమ వివాహం విషాదం… యువతి ఆత్మహ*త్య 😢


జర్నలిస్టు: మాకోటి మహేష్
వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు యువకులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా… పోలీసుల సమక్షంలో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం చివరికి విషాదంగా మారింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది మండలంలో కలకలం రేపింది.

మహానంది మండలం ఈశ్వర్ నగర్‌కు చెందిన శివప్రసాద్, స్వప్న గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు అయినప్పటికీ ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ ప్రేమను వెల్లడించారు.

చివరకు కొందరు పెద్దమనుషుల సమక్షంలో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని యువకుడి తల్లి లక్ష్మీదేవి, బంధువులు ఒప్పుకోలేదు.

దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఆత్మహ*త్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన యువతి… ప్రియుడు ఆత్మహ*త్య చేసుకున్నాడనే భావనతో మహానంది శివారుకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహ*త్య చేసుకుంది.

ఈ ఘటనలో యువతి స్వప్న మృతి చెందగా… యువకుడు శివప్రసాద్ నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే స్వప్న మృతిపై ఆమె తల్లి మరియమ్మ, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వప్నను యువకుడు శివప్రసాద్ బంధువులే చం*పి చెట్టుకు ఉరేసి ఆత్మహ*త్యలా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.

యువతి తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు మహానంది పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు.

#Kurnool
#Mahanandi
#CrimeNews
#AndhraPradesh

0
13 views

Comment