నిశ్చితార్థం తర్వాత విషాదం… చెరువులో దూకి యువతి ఆత్మహ*త్య 😢
జర్నలిస్టు: మాకోటి మహేష్
మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో దూకి ఓ యువతి ఆత్మహ*త్య చేసుకున్న సంఘటన అల్లాదుర్గం మండలంలోని అప్పాజీపల్లిలో జరిగింది.
ఎస్సై శంకర్, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన రూప (22) హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రూపకు వారం రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం.
అయితే గత నాలుగు రోజులుగా ఆమె దిగులుగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సోమవారం గ్రామ శివారులోని చెరువులో దూకి రూప ఆత్మహ*త్యకు పాల్పడింది.
ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను బయటకు తీసి కొన ఊపిరితో ఉన్న రూపను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
మృతురాలు తండ్రి శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
#Medak
#Telangana
#BreakingNews
#CrimeNews