పోస్ట్ ఆఫీస్ తరలింపు పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాకర్
AIMA న్యూస్ శ్రీకాకుళం : కొత్తూరు మండలం మెట్టూరులో గత 76 సంవత్సరాలుగా ఉన్న పోస్ట్ ఆఫీస్ ను నేరడి తరలింపు చర్యలు తీసుకోవడం అన్యాయమని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డ వలస కమలాకర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు .. సుమారు 800 ఖాతాలతో విజయవంతంగా నడుస్తున్న పోస్ట్ ఆఫీస్ సేవలను ఒక మండల నేత మెట్టూరు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా గ్రామ ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పోస్ట్ ఆఫీస్ నేరడి తరలించడం అన్యాయమని కలెక్టర్కు వివరించారు.. త్వరలో మిత్రులకు కొత్త బ్రాంచ్ శాంక్షన్ చేయాలని సోమవారం జరిగే గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు..