తెలంగాణలో విద్యా విధానంపే టేబుల్ సమావేశంలో
*ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి*
*తెలంగాణలో విద్యా విధానం 2026 ఆకునురి మురళి విద్యా కమిషన్ నివేదికపై ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని రామ్ రెడ్డి ఆడిటోరియంలో ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ తరపున నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో హర్షవర్ధన్ రెడ్డి గారు పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీతభత్యాలు కాకుండా బీద విద్యార్థులకు విద్యను ఎలా అందించాలి, ఇప్పటికిప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు ఏ విధంగా శిక్షణలు ఇవ్వాలి, విద్యపై ప్రభుత్వం పెట్టే డబ్బును పదేపదే ఖర్చుగా భావించేటట్టు నివేదికలో పేర్కొన్నారు. కానీ విద్యపై పెట్టే డబ్బు పెట్టుబడిగా చూపించాలి ఎందుకంటే ఇప్పుడు విద్యపై ఏదైతే మనం డబ్బు పెట్టుబడిగా పెడుతున్నామో ఆ పెట్టుబడి ద్వారా రాబోయే రోజుల్లో ఆ పిల్లల భవిష్యత్తే మనకు రాబడిగా మిగులుతుందనే భావనను ఆకునూరు మురళి గారు మరిచారు. అదే విధంగా పాఠశాలల్లో దేశ నాయకుల, స్వతంత్ర సమరయోధుల ఫోటోలు గాని విగ్రహాలు గాని ఉండకూడదని చాలా తప్పయిన విషయం. ఎందుకంటే దేశ నాయకులు స్వతంత్ర సమరయోధుల నుంచి మనం మార్గదర్శకాన్ని నేర్చుకుంటాము, జాతీయ భావాన్ని పెంపొందించుకుంటాము అదేవిధంగా ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి నివేదిక వల్ల అటు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకున్న విద్యార్థులలో ఆందోళన ఉంది, చదువు బోధిస్తున్న ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొన్నది. మొత్తంగా విద్యావేత్తలు, తెలంగాణ సమాజమంతా కూడా ఈ రోజు ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టివేయబడ్డది. ఈ నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వెబ్సైట్ నుంచి తొలగింపచేశారు రాబోయే రోజుల్లో కూడా ఆకునూరు మురళి గారు ఇచ్చే ఏ సలహాలు కూడా తీసుకోవద్దని ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు.*