బుగ్గారం వాసికి "కళా రత్న నేషనల్ అవార్డ్"
ఈనెల 15న తిరుపతిలో అవార్డ్ అందుకోనున్న "నక్క పోచ రాజయ్య"
బుగ్గారం వాసికి "కళా రత్న నేషనల్ అవార్డ్"
ఈనెల 15న తిరుపతిలో అవార్డ్ అందుకోనున్న "నక్క పోచ రాజయ్య"
బుగ్గారం / జగిత్యాల జిల్లా:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త నక్క పోచ రాజయ్య అలియాస్ నక్క రాజు "కళా రత్న నేషనల్ అవార్డ్" కు ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ జారీ చేసిన ఇట్టి అవార్డ్ ఎంపిక పత్రం ను అవార్డుల సెలెక్షన్ కమిటి సభ్యుడు చుక్క గంగారెడ్డి
మంగళ వారం నక్క పోచ రాజయ్య ( నక్క రాజు) కు అందజేశారు. ఈనెల 15 ఆదివారం ఉదయం తిరుపతిలో జరుగనున్న బహుజన సాహిత్య అకాడమీ 18వ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ (అవార్డుల ప్రధానోత్సవ సభ) లో ఇట్టి అవార్డ్ ను అందజేయనున్నట్లు జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అట్టి ఎంపిక పత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆధ్యాత్మిక ఉద్యమ కళాకారుడిగా పేరు ప్రఖ్యాతులు పొంది, విద్యారత్న జాతీయ అవార్డ్, నంది అవార్డు లతో పాటు డాక్టరేట్ కూడా సాధించిన నక్క పోచ రాజయ్య ( నక్క రాజు) నేడు "కళా రత్న నేషనల్ అవార్డ్" కు కూడా ఎంపిక కావడం పట్ల బుగ్గారం మండల ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, విద్యావంతులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు నక్క పోచ రాజయ్య ( నక్క రాజు) ను అభినందిస్తున్నారు.