logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నకిలీ వెబ్‌సైట్‌ల విషయంలో కేంద్రం కీలక హెచ్చరికలు

*_ఆ వెబ్‌సైట్‌ ఫేక్‌.. నకిలీ లింక్‌లతో జాగ్రత్త: కేంద్రం హెచ్చరిక_*

*"అనంతజనశక్తి న్యూస్"AP&TG*

ఇంటర్నెట్ డెస్క్‌: నకిలీ వెబ్‌సైట్‌ల విషయంలో కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది.

అమాయకులను మోసం చేసి డబ్బులు కాజేసేందుకు సైబర్‌ కేటుగాళ్లు చేసే ప్రయత్నాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

సమగ్ర శిక్షా అభియాన్ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా మోసగాళ్లు http://sarvashikshaabhiyan.com అనే వెబ్‌సైట్‌ రూపొందించారని,

దీని ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే సాకుతో డబ్బులు డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించింది.

ఈ మేరకు *పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది. (Fact Check)*

ఈ నకిలీ వెబ్‌సైట్‌తో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతూ...

సమగ్రశిక్షా అభియాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://samagra.education.gov.in/
లింక్‌ని పోస్టు చేసింది.

ఏవైనా ఉద్యోగ నోటిఫికేషన్‌లు, నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లలోనే చెక్‌ చేసుకోవాలని కోరింది.

దేనికైనా దరఖాస్తు చేసే ముందు, లేదా వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేసే ముందు సంబంధిత వెబ్‌సైట్‌లను జాగ్రత్తగా చెక్‌ చేయాలని సూచించింది.

ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ మాయగాళ్ల వలకు చిక్కొద్దని కోరింది.

✒️సేకరణ:ఈనాడు దినపత్రిక వెబ్ సైట్ సౌజన్యంతో

0
0 views

Comment