సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు
మార్కాపురం జిల్లా మార్కాపురం
గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గోట్టి ముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో మార్కాపురంలో గోశ సత్యనారాయణ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సామాజిక సేవలందించిన వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు సూర్యోదయ సంస్థ చేస్తున్న రక్తదాన శిబిరాలు తల సేమియా పిల్లలకు రక్తం ఏర్పాటు చేయడం వృద్ధాశ్రమంలో సంక్రాంతి సంబరాలు పేదలకు ఆకలి తీర్చడంలోనూ విశిష్ట సేవలు అందించినందుకు గాను ఈ అవార్డును అందించారు ఈ అవార్డును గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నకేశవులు ప్రముఖులు పి వి సి అంజనీ కుమారి హైకోర్టు సూపర్నెంట్ హైదరాబాద్ జి గోవింద్ టీచర్ రైటర్ యాక్టర్ జి చెన్నకేశవులు ఇన్ఫోటెక్ సీఈవో బెంగళూరు రాధా హెచ్ఆర్ స్టేట్ మెంబర్ వాసవి క్లబ్ మాజీ గవర్నర్ కిరణ్ కుమార్ గంగిశెట్టి ఎం నాగిరెడ్డి చేతుల మీదుగా డి గోవిందరెడ్డి అందుకున్నారు. దీనికి సూర్యోదయ సంస్థ పలువురు హర్షం వ్యక్తం చేశారు సూర్యోదయ సంస్థ ఇంకా భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాలని పలువురు ఆనందం ఆనందం వ్యక్తం చేశారు