తెలంగాణ రాష్ట్ర శాఖ రద్దు – పెండెల దేవరాజుకు సెంట్రల్ కమిటీలో స్థానం
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించిన పెండెల దేవరాజును పార్టీ సెంట్రల్ కమిటీలోకి తీసుకుంటున్నట్లు పార్టీ నాయకత్వం వెల్లడించింది.
ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు కారుమూరి రామచంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి, భద్రత మరియు ఉపాధి అవకాశాలపై దృష్టి సారించే నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా కొత్త తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు.
ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించిన పెండెల దేవరాజు పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనను సెంట్రల్ కమిటీలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.
త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్త రాష్ట్ర కమిటీని అధికారికంగా ప్రకటిస్తామని కారుమూరి రామచంద్రుడు వెల్లడించారు.