logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జనసేన సభ్యత్వ గడువు పొడిగింపు. సద్వినియోగం చేసుకోవాలన్న. ఇరిగెల రాంపుల్లారెడ్డి

ఆళ్లగడ్డ మండల పరిధిలోని బత్తలూరు గ్రామానికి చెందిన యువత జనసేన పార్టీలోకి చేరారు. మంగళవారం రోజున ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరుల సమక్షంలో గ్రామానికి చెందిన యువత పెద్ద ఎత్తున పార్టీ తీర్థం పుచ్చుకొని సభ్యత్వం తీసుకోవడం జరిగింది.వారికి ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గడువును ఈనెల 17వ తేదీ వరకు అధిష్టానం పొడిగించిందని, ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని ప్రతి జనసైనికుడు, యువత ఉపయోగించుకోవాలని కోరారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సభ్యత్వం ఒక బలమైన ఆయుధమని, యువత చూపిన ఉత్సాహం గ్రామాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర భవిష్యత్తు మార్చగలిగే శక్తి యువతకే ఉందని, అందుకే జనసేన పార్టీ ఎప్పుడూ యువతకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్, తాలూకా ఎస్సీ సెల్ నాయకులు డాల్ రత్నమయ్య, రామానాయుడు, శ్రీనాథ్, నాగ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు

71
1649 views

Comment