logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వినూత్న రీతిలో కడప నగర కార్పొరేషన్ డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని అర్జీల పాడేను మోసుకుంటూ నగరపాలక సంస్థ వద్దకు శవ యాత్ర

వినూత్న రీతిలో కడప నగర కార్పొరేషన్ డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని అర్జీల పాడేను మోసుకుంటూ నగరపాలక సంస్థ వద్దకు శివయాత్ర జరిపిన నగర కాంగ్రెస్ డీసీసీ సయ్యద్ గౌస్ పీర్

కడప నగర కార్పొరేషన్ డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలను పాడే రూపంలో తీసుకొని శివయాత్రగా కార్పోరేషన్ ఆఫీసుకు వచ్చి నిరసన తెలియజేశారు.

ఈ నిరసనలో భాగంగా కమిషనర్ బయటకు రావాలని, అర్జీల పాడెను తీసుకోవాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నగర్ డిసిసి సయ్యద్ గౌస్ పీర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన పట్టించుకునే నాధుడే కరువయ్యారని, పేదల సమస్యలు నగరపాలక అధికారులకు పట్టవా? రంజాన్ మాసంలో నమాజులకు వెళ్లాలన్న సరియైన లైట్లు లేక పాములు విష పురుగులు తిరుగుతున్న ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడ జీవనం సాగిస్తుంటే ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను గాలికి వదిలేశారన్నారు అన్నారు. అలాగే దోమలు, పందులు విష కీటకాలు తిరుగుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రెండవ డివిజన్లో గల డంపింగ్ యార్డ్ వద్ద నివసిస్తున్న ప్రజానీకం ఒక నిమిషం కూడా ఆ దుర్వాసనకు భరించలేని పరిస్థితి ఉందని ఆ దుర్వాసనలో రాత్రంతా నేను ప్రజల కోసం ఉండడానికి సిద్ధంగా ఉండానని మీరు సిద్ధమా అని అధికారులను ప్రశ్నించారు.

మీరు ప్రజల కోసం పనిచేయాలని వారి సమస్యలను పరిష్కరించాలని మీకు ప్రభుత్వాలు నియమించాయని కానీ మీరు కేఎంసి గుర్తులు వదిలేసి ఏదో పార్టీ గుర్తులకు తోత్తులుగా మారారని ఆయన మండిపడ్డారు.
నగర కమిషనర్ సమస్యల పరిష్కారానికి 20వ తేది వరకు గడువు ఇచ్చారని ఆ గడువు కు కూడా స్పందించకపోతే సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామని , కూటమిలో ఉన్న పార్టీలు, వైసిపి మోడీ కి తొత్తులుగా మారారని కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద మధ్యతరగతి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ముందుగా ఉంటుందని ఈ సందర్భంగా
తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు అమీదా ఖానం, గౌరీ, 48వ డివిజన్ అంజన్, 27 డివిజన్ శామీర్, 43వ డివిజన్ జాబిర్ అలీ, 2వ డివిజన్ యూసుఫ్, 44వ డివిజన్ సిద్దిక్ , 39వ డివిజన్ హాజీ భాయ్, 31 డివిజన్ సాదిక్ బాయ్, నాలుగో డివిజన్ సుబ్రహ్మణ్యం, 36వ డివిజన్ అన్వర్, ఐదో డివిజన్ ఫజరూల్లా, 33వ డివిజన్ కరీం, 47 డివిజన్ మహబూబ్ బాషా, 43 వ డివిజన్ ఖాజా పీర్,ఫహీం మరియు నగర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0
79 views

Comment