వెబ్‌వర్స్ హ్యాకథాన్‌లో శాంతిరాం ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థినుల విజయం.
నంద్యాల (AIMA MEDIA ): నంద్యాలకు చెందిన శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) సి.ఎస్.ఈ విభాగం మూడవ సంవత్సరం విద్యార్థినులు బి. సుప్రజా మరియు బి. అంజని ప్రణీత ఇటీవల నిర్వహించిన వెబ్‌వర్స్ హ్యాకథాన్ పోటీలో ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని సాధించారు. హ్యాకథాన్ పోటీలలో సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలతో విశిష్ట ప్రదర్శన ఇచ్చి విజేతలుగా నిలిచి కళాశాలకి కీర్తి తీసుకువచ్చారు.తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో 07-09 తేదీలలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు “స్పార్క్ -2K26 లో పాల్గొన్న విద్యార్థులకు నిర్వాహకులు వెబవర్స్ హ్యాకేతోన్ లో భాగంగా రిసార్ట్స్‌కు సంబంధించిన ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు మూడు టెస్ట్ కేసులను అందించారు. విద్యార్థులు ఆ సమస్యకు సమర్థవంతమైన సాంకేతిక పరిష్కారం రూపొందించి, జడ్జీలను ఆకట్టుకున్నారు.పోటీలో పాల్గొన్న అనేక జట్ల మధ్య కఠినమైన పోటీ జరిగినప్పటికీ, విద్యార్థుల బృందం తమ సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యం మరియు టీమ్‌వర్క్ ద్వారా అద్భుతమైన ప్రాజెక్టును రూపొందించి ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థులు జాతీయ వేదికపై విజయం సాధించడం గర్వకారణమని తెలిపారు. విభాగాధిపతి డా. ఏం.డి. ఫరూఖ్ విజేతలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.