మంచిర్యాల వ్యవసాయ కార్యాలయంలో అటెండర్ ఆత్మహత్యాయత్నం
తేదీ: 10 మార్చి, 2026
మంచిర్యాల: జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న బొల్లి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వ్యవసాయాధికారిణి సురేఖ తనను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నారని, ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ముందడుగు వేసినట్లు సమాచారం. గమనించిన సహచర సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతుండగా, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడి నుండి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్: శ్రీనివాస్,