తాడువాయి గ్రామంలో రెండొవ మహిళా డాక్టర్ గా మాతంగి శైలజ
మునగాల మండలం తాడువాయి గ్రామానికి చెందిన మాతంగి జయరాం కుమార్తె మాతంగి శైలజ తన చిరకాల కాంక్ష అయినా డాక్టర్ చదువు చదవాలి అనే లక్ష్యాన్ని చేరుకోవటం,తన తల్లి,తండ్రి కోరిక నెరవేరటం ఎంతో హర్షించదగిన విషయం అని వారు అన్నారు
మన తాడువాయి గ్రామంలో రెండొవ మహిళా డాక్టర్ గా M.B.B.S.పట్టా తీసుకోవటం ఎంతో శుభపరిణామం అని సామాజిక కార్యకర్త మరియు సాంఘీక ఉపాధ్యుడు అయినా మాతంగి అంబేద్కర్ సంతోషం వ్యక్తం చేసినారు
గ్రామంలో మొదటి మహిళా డాక్టర్ మాతంగి రజిత ను స్ఫూర్తి గా తీసుకొని రాబోయే కాలంలో M.S.కూడా పూర్తి చేయాలనీ,పేదప్రజలకు అండగా ఉండాలి అనే సంకల్పంతో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని అయినా సావిత్రి బాయ్ పూలే వర్ధంతి సందర్భంగా నేను M.B.B.S.పట్టా ను తీసుకోవటం ఎంతో గర్వంగా ఉన్నది అని పట్టా గ్రహీత మాతంగి శైలజ సంతోషం వ్యక్తం చేసినారు
ఈ శుభసాందర్భంలో గ్రామంలోని పెద్ద నాన్న మాతంగి పుల్లయ్య,పెద్దమ్మ అంకమ్మ,బాబాయ్ మాతంగి బసవయ్య కాంగ్రేస్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి,మరియు సర్పంచ్,పాలకవరగ్గా సభ్యులు,మరియు బంధువులు,ప్రజలు,ప్రభుత్వ ఉద్యోగ సమాఖ్య,తాడువాయి హర్షం వ్యక్తం చేసినారు.