డుంబ్రిగుడ: కనువిందు చేస్తున్న కాఫీ పూలు
అరకు మన్యంలో తెల్లగా మల్లెపూలులా విరబూసిన కాఫీ పూలు ఆకట్టుకుంటున్నాయి. డుంబ్రిగుడ మండలం అరమ పంచాయితీ పరిదిలోని బడిమెల పరిసర ప్రాంతాల్లో కాఫీ తోటలు తెల్లటి పూలతో, సువాసనలు వెదజల్లుతూ ఆకట్టుకుంటున్నాయి. సాధరణంగా ఏప్రిల్ చివరి వారం నుండి పూత వస్తుంది, అయితే వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం ముందుగా పూతకు వచ్చాయని గిరి రైతులు పేర్కొన్నారు.