logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు*

పత్రిక ప్రకటన
మార్చి 9, 2026_ఆదిలాబాదు:

*

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ముందుగా వివిధ వ్యాపార రంగాల్లో రాణిస్తున్నమహిళల ద్వారా ఏర్పాటుచేసిన స్టాళ్లను కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా వైద్యారోగ్య, విద్యా, పోలీసు, అంగన్‌వాడీ రంగాల్లో మహిళలు అందిస్తున్న సేవలను కొనియాడారు. అంగన్‌వాడీ సూపర్వైజర్లు బాల్య వివాహాలను అరికట్టడంలో చూపుతున్న చొరవను ప్రత్యేకంగా అభినందించారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు వారి ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తాయని వివరించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు మెరుగైన వైద్యం అందించడంపై దృష్టి సారించాలని, ముఖ్యంగా సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిన్నటి నుండి ప్రారంభమైన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలోని 14 నుండి 15 ఏళ్ల బాలికలందరికీ విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న మిల్లెట్ యూనిట్లు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తయారీ, జూట్ బ్యాగుల తయారీ వంటి స్వయం ఉపాధి రంగాల్లో మహిళలు రాణించడం సంతోషకరమని అన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షను అరికట్టి, వారికి పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించినప్పుడే 'వికసిత భారత్' , 'తెలంగాణ రైజింగ్ 2047' కల సాకారమవుతుందని ఆకాంక్షించారు.

మునిసిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇంటికే పరిమితం కాకుండా ఆరోగ్యం పట్ల ద్రుష్టి సారించాలన్నారు. తోటి మహిళలు కష్టాల్లో ఉన్నప్ప్పుడు వారికీ మనో ధైర్యాన్ని ఇస్తే మరింత ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా పలు రంగాల్లో రాణించి వివిధ అవార్డులు పొందిన పెందూర్ శాంత బాయి, కుమార బాగు బాయి, మర్సుకోల కళావతి, రామ బాయి ఆదివాసీ మహిళలను కలెక్టర్, మునిసిపల్ చైర్ పర్సన్ శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు.

అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన మహళలకు కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ బహుమతులను అందజేసి, సంతకాల సేకరణ బోర్డుపై ఆయన సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సి అభివృద్ధి అధికారి సునీతకుమారి, కలెక్టరేట్ ఏవో వర్ణ, మహిళా కౌన్సిలర్లు ఐసిడిఎస్ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

2
296 views

Comment