కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిపై వైసీపీ నేతల విమర్శలు ఖండనీయం.. ఎమ్మెల్యే ఎంజీఆర్
*▪️కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి పై వైసీపీ నేతల విమర్శలు ఖండనీయం – ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...*
*▪️అభివృద్ధి చూసి ఓర్వలేకే వైసీపీ నేతల అసత్య ఆరోపణలు - సిక్కోలు గర్వకారణం రామ్మోహన్ నాయుడు గారు ....*
*▪️ పాతపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిన ఘనత కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిదన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...*
*▪️ శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్స్టెన్షన్ పిల్లర్లుకు నిధులు మంజూరు చేయించిన ఘనత ఎం.పీ రామ్మోహన్ నాయుడు గారిది...*
*▪️అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు నేరేడి బ్యారేజ్ సహా జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు...*
*▪️పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు మాట్లాడారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిపై వైసీపీకి చెందిన కొందరు నాయకులు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే గారు తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి కొందరు నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థ World Economic Forum నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న రామ్మోహన్ నాయుడు గారు సిక్కోలు జిల్లాకు గర్వకారణమని తెలిపారు.యువకుడిగా దేశ, రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.ఒరిస్సాతో సంబంధం ఉన్న నీటి పారుదల సమస్యలపై కూడా రామ్మోహన్ నాయుడు గారికి పూర్తి అవగాహన ఉందని, పార్లమెంట్ సమావేశాల్లో మరియు ఇతర వేదికల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గారు చెప్పారు. నేరేడి బ్యారేజ్ సమస్యను కూడా పరిష్కరిస్తానని ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు.సిక్కోలు జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించిన మహనీయుడు కీర్తిశేషులు కింజరాపు ఎర్రంనాయుడు గారిపై కూడా అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు.జిల్లాకు జాతీయ రహదారులు, పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచారని గుర్తుచేశారు.కేంద్ర బడ్జెట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు మత్స్యకారులు, రైతులు, పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలు కలిగాయని ఎమ్మెల్యే గారు తెలిపారు. పలాస జీడీ పరిశ్రమ, టూరిజం అభివృద్ధి, సి–ప్లేన్ టూరిజం వంటి కార్యక్రమాల ద్వారా జిల్లాలో అభివృద్ధి మరింత వేగవంతం కానుందని అన్నారు.విజనరీ నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్బాబు గారి సహకారంతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు.ప్రజా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రజలు నిజాలను బాగా తెలుసుకుంటారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు మీడియా మిత్రులు పాల్గొన్నారు.*