పెనుకొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంప్రచార రథాన్ని ప్రారంభించిన మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా ఎస్పీ గారు..
పెనుకొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంప్రచార రథాన్ని ప్రారంభించిన మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్* జిల్లా ఎస్పీ గారు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుకొండ పట్టణంలో నియోజకవర్గ స్థాయి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. మహిళలు మరియు పిల్లల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రత్యేక ప్రచార రథాన్ని మంత్రి, కలెక్టర్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు.'అక్షరాంధ్ర' కార్యక్రమం ద్వారా మహిళలు విద్యావంతులు కావాలని, తద్వారా కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని వారు సూచించారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో నూతనంగా నిర్మించిన బహిరంగ వేదికను (Stage) ఈరోజు గౌరవ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు కలిసి ఘనంగా ప్రారంభించారు.కళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు, క్రీడా కార్యక్రమాలకు మరియు ఇతర ముఖ్య సమావేశాలకు అనుగుణంగా ఈ వేదికను అత్యాధునిక వసతులతో నిర్మించారు.
ఈ కార్యక్రమములో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.