logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ధర్మవరం నియోజకవర్గంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం

ధర్మవరం నియోజకవర్గంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం


భారతదేశం వ్యాప్తంగా జరుగుతున్న హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ,శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ సమక్షంలో ముదిగుబ్బ మరియు మలక వేముల క్రాస్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ , హెచ్‌పీవీ వ్యాక్సిన్ బాలికల ఆరోగ్య రక్షణకు ఎంతో ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా నిర్మూలించవచ్చు అని పేర్కొన్నారు. మన దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గౌరవ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయి పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి అలాగే వైద్య విద్య శాఖ మాత్యులు ఆంధ్రప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని ఎంతో సాయశక్తుల హాస్పిటల్స్ ని బాగుపరచడానికి ఎనలేని కృషి చేస్తున్నారు

తల్లిదండ్రులు తమ కుమార్తెలకు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ వేయించాలని, ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు మరియు కూటమి నాయకులు ఓబీసీ ముదిగుబ్బ మండల అధ్యక్షులు Y చంద్ర మోహన్ , ఎంపీటీసీ మంజునాథ్, మాజీ సర్పంచ్ వెంకట రమణ, కృష్ణమూర్తి యాదవ్ , సూర్య నారాయణ యాదవ్, బి రవీంద్ర రెడ్డి , గంగాధర్ రెడ్డి, మల్లికార్జున, పతి రెడ్డి , కూటమి నాయకులు మరియు కూటమి కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది.

0
3 views

Comment