66మందికి, రూ58లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన సునీత*......
*గత ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని.. 20నెలల్లోనే చేసి చూపించాం*
*ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే.. ఎమ్మెల్యే పరిటాల సునీత*
*పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సునీత సమావేశం*
*66మందికి, రూ58లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన సునీత*
*మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5లక్షల సాయం*
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చేయని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ 20నెలల్లోనే చేసి చూపించామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె రాప్తాడు నియోజకవర్గ నాయకులు-కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీల నియామకం గురించి చర్చించారు. పార్టీ కోసం పని చేస్తున్న వారికి కచ్చితంగా కమిటీల్లో ప్రధాన్యత ఉంటుందని ఎమెల్యే సునీత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్లు, డ్రైనేజీలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని.. సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందించామన్నారు. వీటిన్నింటి గురించి మై టిడిపి యాప్ ద్వారా ప్రజలకు వివరించడంతో పాటు... నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలను అప్లోడ్ చేయాలని సూచించారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ఉన్న సమస్యలు, వ్యక్తిగత సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలన్నారు...
*66మందికి, రూ58లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ప్రమాదభీమా 5లక్షలు చెక్కు పంపిణీ*
రాప్తాడు నియోజకవర్గంలోని పలువురికి ఎమ్మెల్యే పరిటాల సునీత సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందేశారు. అనంతపురం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం 6మండలాలకు చెందిన 66మంది లబ్ధిదారులకు 58లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. అలాగే ఇటీవల రామగిరి మండలం పెద్ద కొండాపురం గ్రామానికి చెందిన గాదికుంట బాబు మరణించగా.. ఆయన కుటుంబానికి పార్టీ నుంచి ఐదు లక్షల ప్రమాద బీమా అందింది. బాబుకు టీడీపీ సభ్యత్వం ఉండటంతో 5లక్షల బీమా అందించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేయగా.. పార్టీ కార్యాలయం నుంచి ఇన్సూరెన్స్ మంజూరు పత్రం పంపారు. దానిని బాబు కుటుంబసభ్యులకు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు, బాబు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే సునీతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ కార్యకర్తల గురించి వారి కుటుంబసభ్యుల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. అందుకే కేవలం వంద రూపాయల సభ్యత్వంతో 5లక్షల వరకు బీమా అందిస్తోందన్నారు. ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి పిల్లల చదువులు కూడా పార్టీ చూసుకునే విధంగా చొరవ తీసుకుంటున్నారన్నారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవలు అందక.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా సాయం అందించినట్టు చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున సాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న నారా లోకేష్ కు నియోజకవర్గ ప్రజల తరుఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు...