logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హెచ్చెల్సీ అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన*....

*పీఏబిఆర్ కుడికాలువ పరిధిలోని చెరువులు 50శాతమైనా నిండాలి*

*హెచ్చెల్సీ అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన*

*క్యాంప్ కార్యాలయంలో హెచ్చెల్సీ అధికారులతో సమావేశం*

*వేసవిలో ప్రజలకు, రైతులకు, జంతుజాలానికి తాగునీటి సమస్య రాకూడదన్న ఎమ్మెల్యే సునీత*

వేసవిని దృష్టిలో ఉంచుకుని ఓ వైపు ప్రజలకు, రైతులకు మరోవైపు గొర్రెలు, మేకలు, పశువులు ఇతర జంతుజాలానికి ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో హెచ్చెల్సీ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఈ సుధాకర రావు, ఈఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీఈఈలు రాధాకృష్ణ, గంగాధర్ బాబు, ఏఈఈ శివశంకరప్ప, ఏఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రస్తుతం పీఏబిఆర్ కుడికాలువకు సరఫరా అవుతున్న నీటి గురించి చర్చించారు. ఇప్పటి వరకు రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలో ఎన్ని చెరువులకు నీరు అందిందన్నది ఆరా తీశారు. ఏప్రిల్ 15వరకు నీటి సరఫరా జరుగుతుందని.. అన్ని చెరువులకు నీరు అందే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అయితే నీటి చౌర్యానికి పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని.. అందుకే చెరువులకు కనీసం 50శాతం నీరైనా వస్తే.. భూగర్భజలాలు తగ్గిపోకుండా ఉంటాయన్నారు. తద్వారా తాగునీటి సమస్య చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కడా ప్రజలకు, రైతులకు, పశువులకు ఇతర జంతుజాలానికి నీటి కొరత ఉండకుండా చూడాలన్నారు. అలాగే ప్రజలు కూడా కాలువలో నీరు వస్తోందని.. మోటార్లు పెట్టడం, గండి కొట్టడం వంటివి చేయవద్దన్నారు. ప్రధాన్యత వారిగా అన్ని చెరువులకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు...

0
0 views

Comment