వన్నెల రాకేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇండియా విక్టరీ సెలబ్రేషన్స్..
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 09/03/2026:
భారత్ విజయం సాధించిన సందర్భంగా జనసేన పార్టీ 20వ వార్డు ఇంచార్జ్ వన్నెల రాకేష్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని పటాకులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.
అదే సమయంలో పరస్పరం స్వీట్లు పంచుకుని భారత జట్టుకు అభినందనలు తెలిపారు. “భారత్ మాతాకీ జై” నినాదాలతో పరిసర ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో పలువురు స్థానిక యువకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయోత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వన్నెల రాకేష్ మాట్లాడుతూ భారత జట్టు అద్భుతంగా ఆడి దేశానికి గర్వకారణంగా నిలిచిందని అన్నారు. దేశం గెలిచిన ఆనందాన్ని ప్రజలతో కలిసి పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.