పి ఆర్ టి యు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
నర్సీపట్నం: PRTU నర్సీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం మార్చి 7వ తేదీ సాయంత్రం నర్సీపట్నం ఆర్.డి.ఓ ఆఫీస్ మీటింగ్ హాల్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డీఈవో శ్రీ పి. అప్పారావు గారు హాజరై మహిళా ఉపాధ్యాయుల సేవలను ప్రశంసించారు. మహిళలు విద్యా రంగంలో చూపుతున్న ప్రతిభ, సేవలు సమాజ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని గోపినాథ్ గారు సమర్థంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అతిథుల చేతుల మీదుగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
తదనంతరం PRTU మహిళా నాయకులైనటువంటి సుగుణ మేడమ్ గారు, పి.వి.ఎం. నాగజ్యోతి మేడమ్ గారులను కూడా ప్రత్యేకంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళా ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.