ఆళ్లగడ్డలో టిడిపికి భారీ షాక్..టిడిపి వీడి వై.ఎస్.ఆర్.సి.పి లో చేరిన ఎంపిటిసి మరియు కార్యకర్తలు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి కి ఎదురుదెబ్బ తగిలింది.టిడిపికి భారీ షాక్ తగిలింది. టీడిపి వీడి వై.ఎస్.ఆర్.సి.పి లో చేరిన ఎంపిటిసి మరియు కార్యకర్తలు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మరియు దుర్మార్గాలను సహించలేక శిరివెళ్ళ మండలం, మహాదేవపురం గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ ఎంపిటిసి షేక్ శంసాద్ బీ మరియు 35 కుటుంబాలు కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మరియు మాజీ శాసన మండలి సభ్యులు గంగుల ప్రభాకర్ రెడ్డి మరియు మాజీ శాసన సభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారనీ తెలిపారు. వారికి పార్టీ కండువా కప్పి సాధనంగా ఆహ్వానించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంచిన నాయకులు, కార్యకర్తలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చేస్తున్న పనులకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసినటువంటి హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇప్పటి నుండి ఈ చేరికలు ఇంకా ఊపందుకుంటాయనీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శిరివెళ్ళ మండల ఎంపిపి వసీం, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా ఉపాధ్యక్షులు సలాం, మండల వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, మండల నాయకులు శివా రెడ్డి, వంకదార సుబ్బయ్య మరియు మహాదేవపురం గ్రామస్తులు జయమ్మ ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ ఛైర్మన్ నరహరి, రాజేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.