logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మానవ హక్కులను రక్షించుకుందాం : సోమరాజు నడపాల

- జాతీయ మానవ హక్కుల నేర నిరోధక నియంత్రణ మండలి భారత్ (ఎన్.హెచ్.ఆర్.ఐ.సి.సి.సి.ఐ)
- కుల,మత,ప్రాంత,భాష తేడా లేకుండా నేర నిరోధక విభాగ జిల్లా భాద్యతలు
- నిర్భయంగా నిలబడి ఎన్.హెచ్.ఆర్.ఐ.సి.సి.సి.ఐ ని ఆశ్రయించండి
- దాడులు చేసే వారికి సహకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి

జనం న్యూస్ మార్చ్ 8 పోలవరం నియోజకవర్గం రిపోర్టర్ : సోమరాజు నడపాల

జాతీయ మానవ హక్కుల నేర నిరోధక నియంత్రణ మండలి భారత్ (ఎన్.హెచ్.ఆర్.ఐ.సి.సి.సి.ఐ) కు సోమరాజు నడపాల జిల్లా భాద్యలుగా నియామకాలు జరిగాయి.ఈ సందర్బంగా సోమరాజు స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాను రాను మానవ హక్కులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని,ఎటువైపు చూసినా కుల మత ప్రాంత భాష భేదాలతో దాడులు జరుగుతున్నాయని,ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా విపరీతంగా దారులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతీ సామాన్య మానవునికి పరోక్షంగా,భౌతికంగా దాడులు జరుగుతున్నాయని,మానవుని అభివృద్ధి ఆటంకనికి ఇదొకానికి నిదర్శనం అని అన్నారు.కులాలపై దాడులు,మతాలపై దాడులు,ప్రాంతాలపై దాడులు,భాషపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.అలాగే దాడులలో చిన్న పెద్ద తేడా లేకుండా ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు.కూలి పనులు చేసే వారిపై దాడులు,చదువుకునే పిల్లపై దాడులు ఎంతవరకు సమంజసం అని అన్నారు.ప్రతీ మానవుడు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ఎందుకు పొందలేకపోతున్నాడని ప్రశ్నించారు.భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను మానవుడు ఎందుకు సంతృప్తిగా పొందలేక పోతున్నాడనేది మానవ సమాజం మొత్తం ప్రశ్నర్ధకంగానే చూస్తుందని అన్నారు.మానవ సమాజంలో అధికంగా రాజకీయ దాడులే మితిమీరి పోతున్నాయని, తప్పులు చేసిన వారిని రాజకీయ పార్టీలే అండగా ఉంటున్నాయని అన్నారు.మరీ ముఖ్యంగా మానవ సమాజంలో మహిళలపై చిన్న పెద్ద తేడా లేకుండా దాడులు జరుగుతున్నాయాన్నారు.కొన్ని చోట్ల న్యాయ వ్యవస్థలు కూడా సమగ్ర తీర్పులు ఇవ్వలేకపోతున్నాయాన్నారు.ఇది కేవలం రాజకీయ పార్టీల ఒత్తిడీల వల్లే మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు.కాబట్టి ఇప్పటికైనా పాలనలో ఉన్న ప్రభుత్వాలు గుర్తించి సామాన్య ప్రజలకు రక్షణగా నిలవాలని అన్నారు.ప్రజలంతా జాతీయ మానవ హక్కుల నేర నిరోధక నియంత్రణ మండలి భారత్ (ఎన్.హెచ్.ఆర్.ఐ.సి.సి.సి.ఐ) సహకారం తీసుకోని నిర్భయంగా నిలబడి సమస్యలను పరిష్కరించుకొండని జిల్లా భాద్యులు సోమరాజు నడపాల అన్నారు.

0
16 views

Comment