జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన జనసైనికులు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని జనసేన పార్టీ ఆళ్లగడ్డ తాలూకా నాయకులు ఇరిగెల రామ్ పుల్లారెడ్డి సోదరులు తమ పార్టీ ఆఫీసు నందు ఆదివారం నాడు ఏర్పాటుచేసిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తాలూకాలోని వివిధ మండలాల నుంచి జనసేన పార్టీ నాయకులు అభిమానులు మరియు జనసైనికులు తన సమూహంతో తరలివచ్చి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మరియు నంద్యాల జిల్లా పార్లమెంటు జనసేన పార్టీ పరిశీలకులు కిలారీ వెంకట రోశయ్య జనసేన సైనికులతో మాట్లాడుతూ నూతన ఉత్సాహాన్ని వారిలో తీసుకురావడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలు మరియు జనసైనికులు భారీగా తరలి రావాలని రెండు రోజులలో పదివేల సభ్యత్వాలు కనీసంగా టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే జనసేన పార్టీ అధిష్టానం ఇరిగెల సోదరులకు నంద్యాల పార్లమెంటు స్థాయిలో గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతుందని ఇరిగేలా కుటుంబ మద్దతుదారులు మరియు ఇరిగెల సైనికులు, జనసైనికులు గమనించాలని,అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన మైలేరి సురేఖ ని త్వరలోనే అధిష్టానం పదవి బాధ్యతలు అప్పజెప్పి ప్రమాణ స్వీకారం చేయబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలు మరియు గ్రామాల నుంచి సుమారు 2000 మంది జనాభా హాజరైనట్లు తెలిపారు.