శంకర్ ఫౌండేషన్ మరియు కోపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్యశిబిరం..
అనకాపల్లి జిల్లా రోలుగుంటలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, విశాఖపట్నం వారి చేత మార్చి 8, 2026, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కో-ఆపరేటివ్ బిల్డింగ్ వద్ద, గవర్నమెంట్ ఆసుపత్రి ప్రక్కన ఉచిత మెగా కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, అనకాపల్లి మరియు కో-ఆపరేటివ్ సొసైటీ (PACS), రోలుగుంట గ్రామం సహకారంతో జరిగే ఈ శిబిరంలో అన్ని కంటి వ్యాధులకు ఉచిత పరీక్షలు చేస్తారు. శుక్లము (క్యాటరాక్ట్) ఆపరేషన్లకు ఎంపికైన నిరుపేదలకు ఉచిత ఆపరేషన్, లెన్సు అమర్చడం; కంటి మీద కండ , మెల్లకన్ను సరిచేయడం, కంటి శుక్లాలకు పెద్దలు, పిల్లలకు ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా ఉచిత చికిత్స అందుతుంది.శిబిరానికి వచ్చేవారు ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డు, ఫోన్ నంబరు, రెండు జతల బట్టలు, కంచం, గ్లాసు తప్పనిసరిగా తీసుకురావాలి. మగవారు గడ్డం చేసుకొని రావాలి; మధుమేహం, రక్తపోటు, ఆయాసం ఉన్నవారు మందులు, చీటీలు, పైకము తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు (EHS, ఆధార్ కార్డులు తప్పనిసరి), ఆరోగ్యభద్రత, ఏపీ ఈపీడీసీఎల్, ఈ సి హెచ్ ఎస్, ఉద్యోగుల కుటుంబాలకు (మెడికల్ హెల్త్ కార్డు తప్పక) అన్ని తనిఖీలు, ఆపరేషన్లు ఉచితం. ఆపరేషన్‌కు ఎంపికైనవారికి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి బస్సులో ఉచిత రవాణా, తిరిగి క్యాంప్ స్థలానికి చేర్చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మడ్డు మహేశ్వరరావు (సెక్రటరీ, పిఎసిఎస్) సుర్ల బాబులు నాయుడు (చైర్మన్, పిఎసిఎస్) క్యాంప్ డెప్యూటీ మేనేజర్ ఎమ్. అరుణ్‌కుమార్, (శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి) పాల్గొన్నారు. చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.