logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మెండే రాజు నేటి వార్త : ​ఉప్పుమడుగులో ముమ్మరంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ పనులు

రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఉప్పుమడుగు గ్రామంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ ప్రణాళికలో భాగంగా ఆదివారం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భవనాలు పాఠశాల బస్టాండ్ ఆవరణలను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు
​గ్రామ సర్పంచ్ కొత్తకొండ రోజా స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ 99 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు బస్టాండ్ పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బందితో కలిసి తొలగించారు.
​ఈ కార్యక్రమంలో ​ఉపసర్పంచ్ అల్లెపు గంగాధర్
​వార్డ్ సభ్యులు మెండే రాజు, మచ్చ రాధ ​పంచాయతీ కార్యదర్శి మొగిలి శ్రీహరి ​వైద్య ఆరోగ్య సిబ్బంది ఏ.ఎన్.ఎం. సంగీత, ఆశవర్కర్ రజిత ​గ్రామ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

31
2524 views

Comment