logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పేకాట స్థావరాల పై పోలీసుల దాడి

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.

- శ్రీకాళహస్తి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాల పై పోలీసుల దాడి, 17 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్,. రూ.2.50 లక్షలు రూపాయలు నగదు మరియు వాహనాలు స్వాధీనం.

- అసాంఘిక కార్యక్రమాల పైన ప్రత్యేక నిఘా...

- తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది.

- అందులో భాగంగా నిన్నటి రోజు రాత్రి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ శ్రీ రవి మనోహర చారి వారి ఆధ్వర్యం లో ఈగల్ టీమ్ సిబ్బంది తో పాటు డీవీ సత్రం పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర చౌదరి, చిట్టమూరు సర్కిల్ సిబ్బంది సంయుక్తంగా శ్రీకాళహస్తి రూరల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం మరియు వారి సిబ్బంది సహితంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నవరం గ్రామ పంచాయతీ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమంగా జూదం ఆడుతున్న వారిపై మెరుపు దాడి నిర్వహించడం జరిగింది.

- ఇందులో మొత్తం 17 మంది జూదగాళ్ల ను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ₹2,50,500/- నగదు, 15 సెల్ ఫోన్ లు మరియు ఒక కారు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.

- జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక దాడులు కొనసాగించాలని జిల్లా యస్పీ శ్రీ సుబ్బరాయుడు ఐ.పి. యస్ గారు అధికారులను ఆదేశించడం జరిగింది.

0
0 views

Comment